లేటెస్ట్..ఈ డేట్ న “అఖండ” మోస్ట్ అవైటెడ్ అప్డేట్.?

Published on Aug 8, 2021 12:00 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి.. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా పై ఒక స్పెషల్ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం.. థమన్ ఇచ్చిన సాంగ్స్ ఎలా ఉండనున్నాయా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మధ్యన మంచి బజ్ నే వినిపిస్తూ వస్తుంది. మరి అలా ఇప్పుడు దానికి ఒక డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

రానున్న ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ అప్డేట్ రానుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ టాక్ ఎంత మేర నిజం కానుందో ఒక అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. మరి ఈ భారీ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వాయు హై బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఇపుడు లాస్ట్ స్టేజ్ షూట్ లో ఈ చిత్రం ఉంది.

సంబంధిత సమాచారం :