నైజాంలో “అఖండ” గట్టిగానే వసూల్ చేసే ఛాన్స్..!

Published on Dec 4, 2021 11:55 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా అన్ని చోట్ల సాలీడ్ కలెక్షన్లను రాబట్టుకుంటుంది.

అయితే నైజాంలో బాలయ్య హవా గట్టిగానే కొనసాగుతుందని అనిపిస్తుంది. ఇక్కడ కలెక్షన్లను చూసుకుంటే తొలిరోజు రూ.4.4 కోట్లు, రెండో రోజు రూ.2.25 కోట్ల వసూళ్లను సాధించింది. రెండు రోజులకు గాను రూ.6.65 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే నైజాం ఏరియాలో ఇదే హవా కనుక బాలయ్యకు కొనసాగితే రూ.15 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం గ్యారంటీగా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :