‘అక్షర’ కాన్సెప్ట్ టీజర్.. బాగుంది !

‘అక్షర’ కాన్సెప్ట్ టీజర్.. బాగుంది !

Published on Nov 16, 2018 6:00 PM IST

టాలెంటెడ్ హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రగా, నూతన ద‌ర్శ‌కుడు బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సినీ మహల్ బ్యానర్ మ‌రియు సినిమా హాల్ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అక్షర”. తాజాగా చిత్రబృందం ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసింది.

కాగా టీజర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతూ.. సినిమా పై అంచనాలను పెంచేసింది. టీజర్ చూస్తుంటే.. సినిమాలో హీరోయిన్ నందిత శ్వేతా మంచి పెర్ఫార్మన్స్ రోల్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. చివర్లో రక్తపు కత్తి రివీల్ అయినప్పుడు నందిత శ్వేత ఇచ్చిన హావభావాలు చాలా బాగున్నాయి. అలాగే టీజర్ లో ప్లే అయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఆకట్టుకుంది.

మొత్తానికి ‘అక్షర’ కాన్సెప్ట్ టీజర్ తోనే బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు