మే లో సెట్స్ మీదకు అఖిల్ 4 ?

Published on Apr 21, 2019 2:00 am IST

ఈఏడాది ప్రారంభంలో మిస్టర్ మజ్ను తో ప్రేక్షకులముందుకు వచ్చిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని కి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం ఈనెల చివర్లో లాంచ్ అయ్యి మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :