అఖిల్ 4 కి అల్ సెట్ !

Published on May 8, 2019 10:11 am IST

వరుసగా మూడు సినిమాలతో పరాజయాలను చవిచూశాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. ఇక ఈ చిత్రం తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ ,బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తన నాల్గవ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండవ వారంలో స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రానికి హీరోయిన్ ను లాక్ చేశారట. త్వరలోనే దీనిపై ప్రకటన వెలుబడనుంది.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక బొమ్మరిల్లు, పరుగు తరువాత భాస్కర్ కూడా ఫామ్ కోల్పోయాడు. మరి ఈ చిత్రంతో అఖిల్ , భాస్కర్ హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More