ఇంటర్వ్యూ : అక్కినేని అఖిల్ – ‘మజ్ను’ టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి.

ఇంటర్వ్యూ : అక్కినేని అఖిల్ – ‘మజ్ను’ టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి.

Published on Jan 23, 2019 4:52 PM IST


‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 25వ తేదీన విడుదలకానుంది. కాగా ఈ సందర్భంగా హీరో అఖిల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

వెంకీ అట్లూరి ఈ ‘మిస్టర్ మజ్ను’ కథ చెప్పగానే మీకు బాగా ఎగ్జైటింగ్ గా అనిపించిందన్నారు. ఈ కథలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏమున్నాయి ?

నాకు ఈ కథ వినగానే నచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్.. ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఇంతకుముందు చేసిన రెండు సినిమాలకి ఇది పూర్తిగా అపోజిట్ ఫిల్మ్. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.

మజ్ను దర్శకుడు వెంకీ అట్లూరి గురించి చెప్పండి ?

వెంకీ గుడ్ డైరెక్టర్ తో పాటు గుడ్ రైటర్ కూడా. తను డాడికి పెద్ద ఫ్యాన్. డాడి మూవీస్ ‘నిన్నే పెళ్లాడతా, మన్మధుడు’ లాంటి సినిమాల ప్రేరణతోనే ఈ సినిమా చేశాడు.

వెంకీ అట్లూరి మీకు ఎప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్ ?

వెంకీ నాకు టెన్ ఇయర్స్ నుంచి తెలుసు. కాకపోతే బెస్ట్ ఫ్రెండ్ ఏమి కాదు. జస్ట్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా చాల సార్లు కలిసాం. కానీ మా మధ్య క్లోజ్ నెస్ అయితే లేదు. మజ్ను దగ్గర నుంచే తను నాకు క్లోజ్ అయ్యాడు.

అఖిల్, హలో సినిమాలు కంటే.. ఈ సినిమా చాలా స్పీడ్ గా చేశారు ?

అలా ఏమి లేదు. కాకపోతే ‘హలో’కి స్క్రిప్ట్ విషయంలో చాలా వర్క్ చేశాం, అలాగే ఆ సినిమాకి షూటింగ్ డేస్ కూడా ఎక్కువ పట్టాయి. అఖిల్ కి కూడా అలాగే జరిగింది. కానీ ‘మిస్టర్ మజ్ను’ ఫుల్ స్క్రిప్ట్ తో వెంకీ రెడీగా ఉండటం వల్ల ఈ సినిమా కొంచం స్పీడ్ గా అయింది.

‘అఖిల్, హలో’ సినిమాలు నుండి మీరు ఏం నేర్చుకున్నారు. అంటే మీ బాడీ లాంగ్వేజ్, డిక్షన్ ఇలా ఈ సినిమాలో మీ నుంచి మేం ఏం కొత్తగా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు ?

ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు అండి. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కావొచ్చు, డిక్షన్, యాక్షన్ కావొచ్చు ఇలా ప్రతి విషయంలో కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో వెంకీ, నేను చాలా వర్క్ చేశాము. ఈ విషయం గురించే ‘మజ్ను’ఆడియో ఈవెంట్ లో తారక్ అన్నయ్య చెప్పారు. ఎప్పటికప్పుడు మన పనిలో మనం ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది. నేను అలాగే విమర్శించుకుంటాను.

ఈ సినిమా టైటిల్ విషయంలో ‘మజ్ను’కి ముందు మిస్టర్ అని పెట్టడానికి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయి ?

మిస్టర్ అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు అయితే ఏమి లేవు. కాకపోతే ఓన్లీ మజ్ను అని పెడితే కొంచెం ఎక్కడో ట్రాజడీ ఫీలింగ్ ఉంటుందేమో అని, వెంకీ మజ్నుకి ముందు మిస్టర్ అని పెట్టాడు. అలాగే మిస్టర్ పెట్టడం వల్ల, సినిమాలోతను ఒక మోడ్రన్ మజ్నును చూపించబోతున్నాడనే సెన్స్ ను కూడా హైలెట్ చెయ్యొచ్చు అనే ఆలోచనతో వెంకీ అలా టైటిల్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా మజ్ను అనే టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి.

ఈ సినిమాలో లవ్ స్టోరీనేనా.. యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందా ?

యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది, త్రీ ఫైట్స్ ఉంటాయి.అలాగే సినిమాలో నాకూ, నా బాబాయ్ కి, నా పిన్నికి మధ్య వచ్చే ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో ఈ సినిమాలో అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటాయి.

ఆడియో ఈవెంట్ లో నాన్నగారు జూ ఎన్టీఆర్ గారి నుంచి ఏదో నేర్చుకోమన్నారు ?

ఏదో కాదు, మాస్ నేర్చుకోమన్నారు. అదే ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు. ఇక ఎలా నేర్చుకోవాలి అని నాన్నగారినే అడగాలి. జనరల్ గా బయట తారక్ నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో ఈవెంట్ లో నా గురించి మాట్లాడుతూ (నవ్వుతూ) చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

తమన్ మ్యూజిక్ గురించి చెప్పండి ?

ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ ఏంత ఇంపార్టెంటో అందరికి తెలుసు. ఖచ్చితంగా తమన్ మ్యూజిక్ ‘మజ్ను’ను మరో లెవల్ కి తీసుకువెళ్తుంది.

ఈ మధ్య మల్టీస్టారర్స్ ఎక్కువుగా వస్తున్నాయి. మీ నుంచి కూడా త్వరలో మల్టీస్టారర్ ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా ?

చేస్తాను. గతంలోనే ఓ మల్టీస్టారర్ చెయ్యమని అడిగారు. కానీ అప్పుడు చెయ్యటం కరెక్ట్ కాదు అని చెయ్యలేదు. కథ నచ్చితే మాత్రం ఫ్యూచర్ లో మల్టీస్టారర్ చేస్తాను.

మీ తదుపరి ప్రాజెక్టులు గురించి చెప్పండి ?

ప్రస్తుతం నా దృష్టి అంతా పూర్తిగా ‘మిస్టర్ మజ్ను’ పైనే ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాతే నా తదుపరి చిత్రం గురించి ప్రకటిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు