మళ్లీ వాయిదా పడనున్న అఖిల్ “ఏజెంట్”?

మళ్లీ వాయిదా పడనున్న అఖిల్ “ఏజెంట్”?

Published on Nov 6, 2022 4:42 PM IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలతో పోటీ పడనున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 2023కి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మేకర్స్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య తొలిసారిగా నటిస్తోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు