
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘అఖిల్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరో నితిన్ ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే భారీ అంచనాలతో క్రేజీ సినిమాగా నిలిచిన ‘అఖిల్’, ఈమధ్యే విడుదలైన టీజర్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది.
‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఇక తాజాగా రెండు పాటల కోసం ఈ సినిమా యూనిట్ ఓ ఫారిన్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుందని అఖిల్ ఈ సందర్భంగా తెలుపుతూ, షూటింగ్ లొకేషన్స్‌లో దిగిన ఫోటోలు కొన్నింటిని అభిమానులతో పంచుకున్నారు. అక్టోబర్ 21న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

