ఆయా షేర్ పాటకు ఫుల్ వైబ్ అవుతున్న నివేదా థామస్.. నెట్టింట వీడియో వైరల్..!

ఆయా షేర్ పాటకు ఫుల్ వైబ్ అవుతున్న నివేదా థామస్.. నెట్టింట వీడియో వైరల్..!

Published on May 8, 2026 7:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘నిన్ను కోరి’ నేడు (మే 8, 2026) గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ రీ-రిలీజ్ హంగామాలో స్వయంగా హీరోయిన్ నివేదా థామస్ పాల్గొని అభిమానులను సర్ప్రైజ్ చేసింది. థియేటర్‌లో సినిమా చూస్తూ ఆడియన్స్‌తో కలిసి ఆమె సందడి చేసింది.

ముఖ్యంగా థియేటర్‌లో ‘ఆయా షేర్’ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో నివేదా థామస్ ఫుల్ జోష్‌లో ఆ పాటకు వైబ్ అవుతూ కనిపించింది. నివేదాలోని ఈ ఉత్సాహాన్ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నాని మాస్ ర్యాంపేజ్‌కు నివేదా కూడా వైబ్ అవుతుండటంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు