19 వరకు అఖిల్ డెబ్యూ మూవీ ఫస్ట్ షెడ్యూల్..

akhil

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమయింది. మొదటి రోజే యాక్షన్ సన్నివేశాలతో అఖిల్ షూటింగ్ ప్రారంభించారు. ఫైట్ మాస్టర్ రవి నేతృత్వంలో ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఈ నెల 19వ తేదీ వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ క్యూట్ లవ్ స్టొరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు.

Exit mobile version