అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ మొదటి సినిమా ఇంకా మొదలు కాకపోయినప్పటికీ మనం లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్ మరియు తను చేస్తున్న యాడ్స్ ప్రమోషన్స్ తో ఫుల్ క్రేజ్ వస్తోంది. మొదట టైటన్ కి సైన్ చేసిన అఖిల్ ప్రస్తుతం మౌంటెన్ డ్యూకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. మౌంటెన్ డ్యూకి బ్రాండ్ అంబాసిడర్ అంటే తను కొన్ని రిస్కీ స్టంట్స్ చెయ్యాలి. ప్రస్తుతం అలాంటి రిస్క్స్ అఖిల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ‘గో బియాండ్ లిమిట్స్’ అనే కాన్సెప్ట్ తో మౌంటెన్ డ్యూ కోసం అఖిల్ ఓ యాడ్ చేస్తున్నాడు. ఈ యాడ్ గురించి అఖిల్ మాట్లాడుతూ ‘నాకు హైట్స్ అంటే చాలా భయం. కానీ ఈ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ హైట్స్ అనే భయం పోయిందని’ అన్నాడు. త్వరలోనే అఖిల్ నటించిన ఈ యాడ్ రిలీజ్ కానుంది. ఇది కాకుండా అఖిల్ – వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చే సినిమా త్వరలో ప్రారంభం కానుంది.


