‘అఖిల్’ చిత్రం తో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని యువ హీరో అఖిల్. అయితే ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ అనే చిత్రంలో నటించాడు. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదనిపించిన అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.
ఇక ఈ సినిమాకు ముందు అఖిల్ తో మారుతీ ‘మహానుభావుడు’ చిత్రాన్ని తెరకెక్కిద్దామనుకున్నాడట. కానీ అఖిల్ అప్పటికే ‘హలో’ షూటింగ్ లో బిజీ అయిపోవడంతో మారుతీ ,శర్వానంద్ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు. అలా అఖిల్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన ‘తొలిప్రేమ’ ఫెమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 3వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ ఆశ తీరుతుందోలేదో చూడలి. ఇక ఈ చిత్రం తరువాత అఖిల్ ఆది పినిశెట్టి అన్న సత్య దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.


