వావ్ అనిపించేలా అఖిల్ అక్కినేని లేటెస్ట్ మేకోవర్!

వావ్ అనిపించేలా అఖిల్ అక్కినేని లేటెస్ట్ మేకోవర్!

Published on Jun 13, 2024 2:01 AM IST

టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని చివరిసారిగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే తన 6 వ చిత్రం ను సాహో మరియు రాధే శ్యామ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని బయట కనిపించారు. హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గుబురు గడ్డం, పొడవాటి జుట్టు తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. లేటెస్ట్ మేకోవర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా తన నెక్స్ట్ మూవీ కోసం అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి అఖిల్ ఎలాంటి అప్డేట్ ను అందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు