రెండో వీకెండ్ హౌస్ ఫుల్స్ తో ‘లెనిన్’..!

రెండో వీకెండ్ హౌస్ ఫుల్స్ తో ‘లెనిన్’..!

Published on Jul 18, 2026 10:39 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన సాలిడ్ విలేజ్ యాక్షన్ డ్రామానే ‘లెనిన్’. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే మొదటి వారం రన్ మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో వీకెండ్ లోకి వచ్చాక మరోసారి హౌస్ ఫుల్స్ తో అదరగొడుతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మెయిన్ గా ఈ సాయంత్రం, సెకండ్ షోస్ లో లెనిన్ మంచి అక్యుపెన్సీ లతో హౌస్ ఫుల్ రన్ పెడుతున్నాడట. సో లెనిన్ ఈ వీకెండ్ కి వచ్చే వసూళ్లతో మేకర్స్ కోరుకున్న 100 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరకి వెళ్లొచ్చని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సూర్య దేవర నాగవంశీ, కింగ్ నాగార్జునలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు