యూఎస్ మార్కెట్ లో ‘లెనిన్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!

అఖిల్ అక్కినేని హీరోగా యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ హా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ‘లెనిన్’. ఎప్పుడో మొదలైనప్పటికీ ఇంత లేట్ గా వచ్చినా కూడా మేకర్స్ మంచి ఫలితాన్ని ఆడియెన్స్ నుంచి అందుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా లెనిన్ వసూళ్ల పరంగా కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు అని చెప్పవచ్చు. మెయిన్ గా యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికాలో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కడం విశేషం. అక్కడ ప్రీమియర్స్ డే కి కలిపి 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ దాటి ఇపుడు 3 లక్షల మార్క్ దిశగా లెనిన్ వెళుతున్నాడు.

ఇక వీకెండ్ కి ఈజీగా హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి 1 మిలియన్ దగ్గరకి వెళ్లినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో మొత్తానికి అఖిల్ మాత్రం చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ సాలిడ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా నాగవంశీ, నాగార్జునలు నిర్మాణం వహించారు.

Exit mobile version