అఖిల్ 3 షూటింగ్ ప్రారంభం !

అఖిల్ 3 షూటింగ్ ప్రారంభం !

Published on Jun 21, 2018 5:46 PM IST

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్ర షూటింగ్ ఈ రోజు ఇంగ్లాండ్ లోని కెంట్ లో ప్రారంభమైంది తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర 70 శాతం షూటింగ్ అక్కడే జరుగనుంది ఈ లాంగ్ షెడ్యూల్ తరువాత చిత్ర టీం హైదరాబాద్ కు వచ్చి మిగితా చిత్రకరణను కంప్లీట్ చేసుకోనుంది . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుంది .

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ వి సి సి పతాకం ఫై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ చిత్ర టైటిల్ కి మిస్టర్ మజ్ను అనే పేరు పరిశీలనలో వుంది అక్టోబర్ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు