ఆచి తూచి అడుగేస్తున్న అఖిల్

ఆచి తూచి అడుగేస్తున్న అఖిల్

Published on Jun 19, 2014 10:08 PM IST

Akhil
‘మనం’ సినిమాలో అతిధి పాత్ర చేసి అందర్ని ఆశ్చర్య పరిచిన అఖిల్ అక్కినేని ఈ ఏదాది తన తొలి చిత్రం తీస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై అఖిల్ జూన్ నెలలో ఒక ప్రకటన చేస్తాడని భావించినప్పటికీ ఎటువంటి ప్రకటన రాలేదు.

అఖిల్ తన తొలి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తునట్టు తెలుస్తోంది. అన్ని విభాగాలలో తనపై తనకు నమ్మకం వచ్చాకే ముందడుగు వేస్తాడని అర్ధమవుతుంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం చూస్తే, అఖిల్ ఒక మాస్ హీరోకి అవసరమైన డ్యాన్సులు, ఫైట్స్ లలో శిక్షణ పొందుతునాడని తెలుస్తోంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే, అఖిల్ తొలి సినిమా ప్రకటనకు మరికాస్త సమయం పడుతుంది. అన్ని విభాగాలలో పరిపూర్ణత పొందాలంటే కాస్త సమయం తీసుకోవాల్సిందే మరి.

తాజా వార్తలు