పార్ట్ 2 ఓటిటి ఎంట్రీకి ముందు ‘ధురంధర్ 1’ పాన్ ఇండియా ఎంట్రీ మళ్ళీ!

పార్ట్ 2 ఓటిటి ఎంట్రీకి ముందు ‘ధురంధర్ 1’ పాన్ ఇండియా ఎంట్రీ మళ్ళీ!

Published on Apr 23, 2026 1:07 PM IST

బాలీవుడ్ సినిమా నుంచి ఇటీవల వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలే “ధురంధర్” సిరీస్ అని చెప్పొచ్చు. మంచి హైప్ నడుమ వచ్చిన రెండు సినిమాలూ 3000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే పార్ట్ 2 ఇప్పటికీ థియేటర్స్ లో రాణింస్తుంది కానీ ఓటిటి ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

కానీ ఇది ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఈ గ్యాప్ లో ధురంధర్ 1 పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. అయితే ఈసారి బుల్లితెరపై సిద్ధం అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా శాటిలైట్ హక్కులు స్టార్ సంస్థ సహా పలు ఇతర ఛానెల్స్ సొంతం చేసుకోగా వాటిలో ఒకే రోజు ఈ సినిమా టెలికాస్ట్ కి సిద్ధం అయ్యింది.

వీటిలో తెలుగు (స్టార్ మా), తమిళ్ (స్టార్ విజయ్) వెర్షన్ లు కూడా ఉన్నాయి. హిందీలో ఆసియా నెట్, కన్నడలో కలర్స్ కన్నడ, మరి ఈ డేట్ కూడా మే 31 కి లాక్ చేశారు. అంటే ఇంకా నెలకి పైగా సమయం ఉండగానే లాక్ చేశారు మేకర్స్. అలాగే ఆరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఈ సినిమా మొదటిసారి టెలికాస్ట్ కి రాబోతుంది. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి సంచలనం సెట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు