
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే పలు వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోస్‌తో అఖిల్ ఎంట్రీ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందనేది ఋజువైంది. ఇక సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ అనే ఫిక్స్ చేసి నిన్న సాయంత్రం విడుదల చేసిన టీజర్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అఖిల్ ఈజ్‌కు మంచి క్రేజ్ వస్తోంది.
నిన్న సాయంత్రం ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విడుదల చేసిన టీజర్, అతి కొద్దిసేపట్లోనే ట్రెండింగ్‌గా నిలబడింది. ఇక యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే ఈ టీజర్ 5 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హీరో నితిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అక్టోబర్ నెల 21న పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

