అఖిల్ మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడట

Published on Sep 22, 2020 5:11 pm IST

అక్కినేని అఖిల్.. అందం, అభినయం, డ్యాన్సింగ్ టాలెంట్ అన్నీ ఉన్నాయి. కానీ లేనిదల్లా సక్సెస్. హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినా అఖిల్ కు చెప్పుకోదగిన విజయం దొరకలేదు. ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రం ‘అఖిల్’ భారీ డిజాస్టర్ అవడంతో అఖిల్ చాలా డీలాపడ్డాడు. అసలు అఖిల్ ‘అఖిల్’ చిత్రం చేయడానికి కారణం మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే కోరికే. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు ఉండే వెయిట్ వేరు. ఆ ఇమేజ్ ప్రేక్షకులు హీరోలకు త్వరగా కనెక్టయ్యేందుకు సహకరిస్తుంది. అందుకే అఖిల్ ఆ ఇమేజ్ కోరుకుని చేసిన తొలిప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అఖిల్ పంథా మార్చి సాఫ్ట్ సినిమాల వైపు మళ్లాడు.

అలా చేసిన సినిమాలే ‘హలో, మిస్టర్ మజ్ను’. వీటిలో ‘హలో’ పర్వాలేదనిపించినా ‘మిస్టర్ మజ్ను’ పరజాయాన్ని చవిచూసింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్న అఖిల్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. సురేందర్ రెడ్డి అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలన్నీ యాక్షన్ ఎంటర్టైనర్లే. అఖిల్ హీరోగా చేయనున్న సినిమా కూడ అలాగే యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. అంటే అఖిల్ తన మాస్ ఇమేజ్ కోరికను తీర్చుకోవడానికి మరోసారి రిస్క్ చేస్తున్నాడని అర్థమవుతోంది.

ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి హెవీగా ప్లాన్ చేస్తున్నారట. పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి హాలీవుడ్ స్టాండర్డ్స్ పాటించనున్నారు. యాక్షన్ కంటెంట్ ఎక్కువ కనుక పైట్స్ కంపోజ్ చేయడానికి హాలీవుడ్ స్టంట్ నిపుణులను తీసుకొస్తున్నారట. విజువల్ ఎఫెక్ట్స్ కూడ భారీగానే ఉంటాయట. సినీ టౌన్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఇందొక స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More