సాంగ్ తో మొదలెట్టనున్న అఖిల్ !

సాంగ్ తో మొదలెట్టనున్న అఖిల్ !

Published on May 24, 2020 10:28 PM IST


అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. జూలై నుండి ఈ సినిమా షూట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అయితే ముందుగా సాంగ్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ చాల కొత్తగా ఉంటాయట. ముఖ్యంగా అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు