నిశ్చితార్థం అయ్యాకే సినిమా మొదలుపెట్టనున్న అఖిల్ !

17th, November 2016 - 08:39:41 AM

akhil
అక్కినేని నట వారసుడిగా 2015 లో తెలుగు తెరకు పరిచయమైన అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’ తీవ్ర నిరాశకు గురిచేయడంతో దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని రకరకాల సబ్జెక్ట్స్ విని, చాలా మంది దర్శకులను కలిసి ఫైనల్ గా విక్రమ్ కుమార్ తో కలిసి పనిచేసేందుకు పచ్చ జెండా ఊపాడు. అయితే ఈ ప్రాజెక్టును వచ్చే సంవత్సరం జనవరిలో మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట అఖిల్.

ఎందుకంటే డిసెంబర్ 9న తన ప్రేయసి శ్రియ భోపాల్ తో జరగబోయే నిశ్చితార్థ వేడుక పనుల్లో బిజీగా ఉండటం వలన పైగా వేడుక ముగిశాక కాస్త టైమ్ తీసుకుని ప్రశాంతంగా సినిమా మొదలుపెట్టాలని అఖిల్ యోచిస్తున్నాడట. ఇదే విషయాన్ని అఖిల్ విక్రమ్ కుమార్ కు చెప్పాడని, ఆయన కూడా అంగీకరించి జనవరిలో సినిమా మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడని వినికిడి. ఇకపోతే ఈ సినిమా అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన రొమాంటిక్ డ్రామా జానర్లోనే ఉండనుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అఖిల్ కోసం హీరోయిన్ వెతికే పనులు జరుగుతున్నాయి.