ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తల్లి నాగరత్నం ఇటీవలే స్వర్గస్థులైన సంగతి విదితమే. తల్లిని కోల్పోయి భాధలో ఉన్న వినాయక్‌ను అక్కినేని అఖిల్ పరామర్శించారు. సోమవారం గోదావరి జిల్లాలో గల వినాయక్ స్వగ్రామం చాగల్లు వెళ్లారు. వినాయక్ తో పాటు వారి కుటుంబ సభ్యులను అఖిల్ పరామర్శించారు. తల్లిదండ్రులను కోల్పోవడం వినాయక్ కుటుంబానికి తీరని లోటు అని అఖిల్ అన్నారు.
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న తొలి సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించనున్నారని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయని సమాచారం. అఖిల్ సన్నిహిత మిత్రుడు, యువహీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు.


