అఖిల్ “ఏజెంట్” డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Sep 23, 2023 12:00 am IST

టాలీవుడ్ యంగ్ హీరో, అఖిల్ అక్కినేని స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి కొన్ని నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఓటిటి లోకి రాలేదు. ఇది అభిమానులను మరియు సాధారణ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మీలో చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇక్కడ ఉంది. ఏజెంట్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. తాజా అప్డేట్ ప్రకారం సోనీ LIV ప్లాట్‌ఫారమ్‌లో ఏజెంట్ సినిమా సెప్టెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది.

ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలలో ప్రసారం కానుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా, సాక్షి వైద్య ఏజెంట్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :