యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ మొదలు పెట్టనున్న అఖిల్

యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ మొదలు పెట్టనున్న అఖిల్

Published on Dec 30, 2014 3:21 AM IST

Akhil-Akkineni12
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా ఈ తరం యువ హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా నటించనున్న సినిమాకి వివి వినాయక్ డైరెక్టర్. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. అందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్ర టీం తెలిపిన తాజా సమాచారం ప్రకారం జనవరి మొదటి వారంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా వివి వినాయక్ మొదటగా అఖిల్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నాడు. ప్రస్తుతం అఖిల్ షూట్ కోసం కసరత్తులు చేస్తూ, ఫస్ట్ డే షూట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం కూడా ఈ చిత్ర టీం అన్వేషిస్తున్నారు.

అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు. నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.

తాజా వార్తలు