అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా ఈ తరం యువ హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా నటించనున్న సినిమాకి వివి వినాయక్ డైరెక్టర్. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరబాద్ ఓల్డ్ సిటీలో మొదలు పెట్టి అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని షూట్ చెయ్యడానికి సన్నాహలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే మాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని అమెరికా మరియు సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాకే ఈ చిత్ర టీం అమెరికా వెళ్లనున్నారు. ప్రస్తుతం అఖిల్ షూట్ కోసం కసరత్తులు చేస్తూ మధ్య మధ్యలో తెలుగు వారియర్స్ తరపున క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆడుతున్నారు. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం కూడా ఈ చిత్ర టీం అన్వేషిస్తున్నారు.
అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు. నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.


