మరో అవకాశాన్ని అందుకున్న అఖిల్ హీరోయిన్ !
Published on Jun 15, 2018 5:15 pm IST

అఖిల్ నటించిన ‘హలో’ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా ఆమెకు ఆశించినంత బ్రేక్ ఇవ్వకపోవడంతో ఆమెకు అవకాశాలు వేగంగా రాలేదు. ఇప్పుడిప్పుడే దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్, సుధీర్ వర్మల గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటిస్తున్న ఆమె ఇంకో అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

అదే కిశోర్ తిరుమల, సాయి ధరమ్ తేజ్ ల చిత్రం. ఎప్పటి నుండో చర్చలు దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందట. ఈ చిత్రంలో కథ ప్రాకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారని,ఆ అందులో ఒకరు కళ్యాణి ప్రియదర్శన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక సమాచారం వెలువడే వరకు ఆగాల్సిందే.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook