
అఖిల్ సినిమాతో తెలుగు పరిశ్రమకు అక్కినేని వంశం నుంచి అఖిల్ అక్కినేని అనే హీరో పరిచయం కానుండడం ఒక విశేషం కాగా, ఇదే సినిమాతో సయేషా సైగల్ అనబడే మరో స్టార్ వారసురాలు కూడా పరిచయం కానుండడం మరో విశేషం. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సయేషా, అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అఖిల్ సినిమా సెట్స్‌పై ఉండగానే పలు బాలీవుడ్ ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
తాజాగా అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం చేస్తూ తెరకెక్కిస్తోన్న శివాయ్ సినిమాలో నటించేందుకు సయేషా ఒప్పుకున్నారు. ఇక ఈ వారం నుంచే సయేషా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అఖిల్ సినిమాతో లుక్స్ పరంగా, విజువల్స్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా బాగా ఆకట్టుకున్న సయేషా, సినిమా రిలీజ్ తర్వాత మరింత పాపులర్ అయిపోతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వెంట వెంటనే టాలీవుడ్, బాలీవుడ్ డెబ్యూట్ సినిమాలను సిద్ధం చేస్తూ సయేషా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు.