సమీక్ష : అక్కడొకడుంటాడు – ఆసక్తిగా సాగదు

Published on Feb 1, 2019 6:20 pm IST

విడుదల తేదీ : ఫిబ్రవరి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : వి బాబు, వినోద్ కుమార్, రామ్ కార్తిక్ త‌దిత‌రులు.

దర్శకత్వం : శ్రీపాడ విశ్వక్.

నిర్మాత : శివ శంకర రావు కంటగమనేని, కె. వెంకటేశ్వరరావు

ఎడిటర్ : సాయి జ్యోతి అవదుటా

శ్రీపాడ విశ్వక్ దర్శకత్వంలో రామ్ కార్తిక్, దీపిక హీరో హీరోయిన్లగా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకం పై శివ శంకర రావు కంటగమనేని, కె. వెంకటేశ్వరరావు సంయుక్తగా నిర్మించిన చితం ‘అక్కడొక్కడుంటాడు’.

స్టోరీ:

కార్తీక్, వంశీ, నిత్య, ఆది మరియు సత్య అనే ఐదుగురు స్నేహితులు కలిసి ఒక ప్రముఖ రాజకీయవేత్త కె.కె. (రవి బాబు) బ్లాక్ మనీని దోపిడీ చెయ్యాలనుకుంటారు. దోపిడీ చేసే క్రమంలో కళ్ళు లేని యోగి (శివ కంటగమనేని ) వాళ్ళను అడ్డుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళు దోపిడీ చేసారా ? లేదా ? వాళ్ళ అక్కడ నుండి ఎలా బయట పడ్డారు ? అసలు యోగి ఎవరు ? ఎందుకు అతను కెకె బ్లాక్ మనీకి కాపాలా ఉన్నాడు ? చివరికి ఈ కేసు నుండి ఆ ఐదుగురు స్నేహితులు ఎలా తప్పించుకుంటారు? లాంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ చిత్రం చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే.. ముందుగా కళ్ళు కనబడని యోగి పాత్రలో నటించిన శివ కంటగమనేని చాలా చక్కగా నటించాడు. సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఆయన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో శివ నటన చాలా బాగుంది. ఇక ఐదుగురు స్నేహితులుగా నటించిన నటి నటులు కూడా తమ పాత్రల్లో వారి వారి నటనతో ఆకట్టుకుంటారు. బ్లాక్ మనీ సంబంధించిన సన్నివేశాల్లో వీరి నటన బాగుంది.

ఈ సినిమాలో అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా కనిపించిన రవిబాబు ఆ పాత్రలో ఎప్పటిలాగే తన గంభీరమైన హావభావాలతో మెప్పిస్తాడు. ఇక సినిమాలో క్లైమాక్స్ లో హైలైట్ చేసిన సామాజిక సందేశం బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం యొక్క ప్రధాన మైనస్ పాయింట్ అంటే… ప్లో లేని కథాకథనాలే. ఇంటర్వెల్ వచ్చేదాకా కథ ఓపెన్ కాకపోవడం, ఉన్న కథలో కూడా ఆకట్టుకునే అంశాలు లేకపోవడం, ఎక్కడా దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మల్చలేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగవు. పైగా కథలో సహజత్వం కూడా ఉండదు. సినిమాలోని చాలా సీన్స్.. అలాగే పాత్రలు.. వాటిని తెరపై మలిచిన విధానం కృత్రిమంగా అనిపిస్తాయి.

దర్శకుడు కథాకథనాల విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. కానీ దర్శకుడు అనవసరమైన సన్నివేశాలతో సినిమా నిడివిని నింపేశాడు. దాంతో సినిమా పై ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా పోయి.. మొత్తానికి సినిమా ఫలితం దెబ్బ తింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీపాడ విశ్వక్ ఓ ప్రయత్నం అయితే చేశాడు గాని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయారు.
సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆయన అందించిన పాటలు కూడా కొన్ని ఆకట్టుకున్నాయి. ఇక రాజా శేఖరన్.ఎన్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లే సాగుతుంది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.

తీర్పు :

శ్రీపాడ విశ్వక్ దర్శకత్వంలో రామ్ కార్తిక్, దీపిక హీరో హీరోయిన్లగా వచ్చిన ఈ డార్క్ థ్రిల్లర్ నిరుత్సాహ పరుస్తోంది. సినిమాలో చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తాయి. దీనికి తోడు కథనం కూడా మరి స్లోగా సినిమాటిక్ గా సాగుతుంది. మొత్తానికి ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోనే విధంగా సాగదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :