కాలేజి నేపద్యంలో అక్కినేని హీరో సినిమా !

20th, January 2018 - 10:42:01 AM


‘మ‌హానుభావుడు’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ నాగ చైతన్య , అను ఇమ్మానుల్ హీరో హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న ప్రారంభం అయ్యింది. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకేక్కబోతుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని సమాచారం. హీరో, హీరోయిన్ ఇద్దరూఈ మూవీ లో కాలేజీ స్టూడెంట్స్ గా నటించబోతున్నారు. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భూమిక, మాధవన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.