బాలీవుడ్ హిట్ రీమేక్‌లో అక్కినేని హీరో?

బాలీవుడ్ హిట్ రీమేక్‌లో అక్కినేని హీరో?

Published on Dec 1, 2015 8:50 PM IST

sumanth
అన్ని భాషల వారికీ కనెక్ట్ అయ్యే సినిమాలు ఎప్పుడో గానీ రూపొందవు. అందులోనూ కథాంశమే విచిత్రంగా, కొత్తగా ఉండే సినిమాలైతే చాలా అరుదు. బాలీవుడ్‌లో విలక్షణ సినిమాలతో మెప్పించిన సుజిత్ సర్కార్ రూపొందించిన ‘విక్కీ డోనార్’, ఈ తరహా సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. వీర్యం దానం చేసే ఓ యువకుడి కథగా రూపొందిన ఈ సినిమా 2010లో విడుదలై మంచి హిట్ సాధించింది.

బాలీవుడ్‌లో ‘విక్కీ డోనార్’ సినిమా విడుదలప్పట్నుంచీ ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందంటూ వార్తలు రావడమే కానీ, అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఈ రీమేక్‌కు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న సుమంత్, తనకు ఈ రీమేక్ ద్వారా హిట్ వస్తుందన్న నమ్మకంతో వెంటనే ఈ ప్రాజెక్టును ఓకే చేశారని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు