తాజాగా సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో !

తాజాగా సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో !

Published on Jun 24, 2018 12:23 PM IST

Naga chaithanya1

సుదీర్ బాబు హీరోగా క్లాసిక్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `స‌మ్మోహ‌నం` చిత్రం సంచలన విజయం సాధించి, ఇంకా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల నీరాజనాలను కూడా అందుకున్న చిత్రంగా ‘సమ్మోహనం’ నిలిచింది. కాగా ఇలాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య మిస్ చేసుకున్నారు. మొదట ఈ చిత్ర కథను ఇంద్రగంటి చైతుకి వినిపించారు. కానీ ఎందుకో నాగచైతన్యకి సమ్మోహనం కథ కనెక్ట్ కాలేదు. ‘సమ్మోహనం’కథే కాకుండా మరో రెండు కథలను కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నాగచైతన్యకు వినిపించారట.

కానీ చైతు దగ్గరనుంచి సరైన స్పందన రాకపోవడంతో సమ్మోహనం ప్రాజెక్ట్ సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళడం ఆయనకు కథ బాగా నచ్చడంతో చాలా స్పీడుగా చిత్రం తెరకెక్కి ఎలాంటి ఆటంకం లేకుండా విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ‘సమ్మోహనం’ నాగచైతన్యకు చాలా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ సుదీర్ బాబు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు