లెనిన్ సక్సెస్ పై అక్కినేని హీరోలు..!

లెనిన్ సక్సెస్ పై అక్కినేని హీరోలు..!

Published on Jul 21, 2026 2:00 AM IST

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంతో పదేళ్ల తర్వాత భారీ హిట్ అందుకోవడంతో అక్కినేని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ సినిమా కోసం తన పనులన్నీ పక్కనబెట్టి శ్రమించిన నాగార్జున, సినిమా మంచి వసూళ్లు సాధించడంతో రిలాక్స్ అయ్యాడు. తాజాగా జరిగిన మూడో సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య.. సినిమాపై తన తండ్రి నాగార్జునకు ఉన్న అంకితభావాన్ని, పట్టుదలను ఎంతగానో కొనియాడారు.

​ఈ వేడుకలో నాగచైతన్య తమ్ముడు అఖిల్ అద్భుత నటనను, ‘లెనిన్’ లాంటి వైవిధ్యమైన కథను ఎంచుకున్న అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. చిత్ర బృందం పడ్డ సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని చైతన్య పేర్కొన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు