‘యూ టర్న్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమంత

‘యూ టర్న్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమంత

Published on Aug 14, 2018 3:54 PM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా సమంత కూడా ప్రమోషన్లను స్టార్టు చేసింది. ఈ సినిమా శీర్షికతో టీ- షర్టు ధరించి ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో, సామ్ తన అభిమానులను మల్టీప్లెక్స్ లో యూ టర్న్ పోస్టర్లతో సెల్ఫీ లు దింగండని, అలా దిగిన వారిలో విన్ అయిన వారు ఫ్రీ టీ షర్ట్స్ తో పాటుగా ఈ నెల 17వ తేదీన జరిగే ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనవచ్చు అని తెలిపింది.

కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ ఒకే సారి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు