నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే చాలా డిఫరెంట్ ఫిల్మ్ గా నిలిచిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. ఇప్పటికే సగంభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. తాజా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రొమాన్స్ చెయ్యడానికి మరో హీరోయిన్ ని సెలక్ట్ చేసారు. తనే యంగ్ హీరోయిన్ అక్ష..
‘యువత’, ‘రైడ్’,’కందిరీగ’ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించి మెప్పించిన అక్షకి బాలకృష్ణ తో సినిమా చేసే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఉంది. అలాగే తనది చిన్న రోల్ కాదని, తను కూడా సినిమాలో ఒక హీరోయిన్ అని చెబుతోంది. అలాగే ఈ సినిమా తనకి కావాల్సిన బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది. గోపి మోహన్ – కోన వెంకట్ కలిసి కథని అందించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అందులో ఓ మేజర్ ఎపిసోడ్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగానుండడం విశేషం. ఎరోస్ వాళ్ళతో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ కల్లా ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా 2016 జనవరి 14న సినిమాని రిలీజ్ చేయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


