టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘అక్షర’ !

టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘అక్షర’ !

Published on Jun 20, 2019 8:23 PM IST

టాలెంటెడ్ హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రగా, నూతన ద‌ర్శ‌కుడు బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సినీ మహల్ బ్యానర్ మ‌రియు సినిమా హాల్ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అక్షర”. కాగా ఈ మూవీ టీజర్ లాంచ్ అనీల్ రావిపూడి చేతులు మీదుగా జరిగింది. కాగా టీజర్ కామెడీగా సాగుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాల ఆసక్తిగా సాగుతుందట. ఒక సీరియస్ పాయింట్ ని తీసుకొని ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా రూపొందిచారట. ఈ చిత్రంలో నందిత ఫిజిక్స్ లెక్చరర్ గా లీడ్ రోల్ లో కనిపించనున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రాన్ని హాల్ బ్యానర్ ఫై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి ఈ చిత్రం నందితా శ్వేతకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

ఇక ఈ సినిమాలో నటీనటులు: అభినవ్,శ్రీ తేజ్,అజయ్ ఘోష్,సంజయ్ స్వరూప్,శ్రీకాంత్ అయ్యర్,అప్పాజీ అంబరీష, మాణిక్యం రెడ్డి తదితరులు. సాంకేతిక నిపుణులు: కెమెరామన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్- జి.సత్య, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన,దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు