ఆ సినిమా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది !

Published on Apr 17, 2019 10:05 am IST

అశ్విన్ గంగరాజు ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం ఆకాశవాణి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిన్నటి తో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ లో ఈ షూటింగ్ పూర్తి చేశారు. 50రోజుల పాటు ఈ షెడ్యూల్ డిఫ్రెంట్ లొకేషనల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాల బైరవ సంగీతం అందిస్తుండగా ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదలతేది ని ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :