సమీక్ష : భూత్ బంగ్లా –  మెప్పించలేకపోయిన హారర్ డ్రామా

సమీక్ష : భూత్ బంగ్లా –  మెప్పించలేకపోయిన హారర్ డ్రామా

Published on Apr 17, 2026 5:43 PM IST

విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అక్షయ్ కుమార్, వామికా గబ్బి, పరేశ్ రావెల్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు
దర్శకుడు : ప్రియదర్శన్
నిర్మాత : అక్షయ్ కుమార్, శోభ కపూర్, ఏక్తా కపూర్
సంగీతం : ప్రీతమ్
సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి
ఎడిటింగ్ : అయ్యప్పన్ నాయర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

చాలా కాలం తర్వాత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరియు దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘భూత్ బంగ్లా’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ హారర్ కామెడీ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

​కథ:

ఇండియాలో ఉన్న తన వారసత్వ బంగ్లాలో తన చెల్లి పెళ్లి చేయాలని లండన్ నుంచి వస్తాడు అక్షయ్ కుమార్. అయితే, అతడికి ఇక్కడ కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఆ బంగ్లాకి సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇంతకీ అక్షయ్ ఆ బంగ్లా గురించి తెలుసుకుంది ఏమిటి? అందులో ఏం ఉంది? అక్షయ్ తన చెల్లి పెళ్లి ఆ బంగ్లా లో చేస్తాడా లేదా..? అనేది ఈ సినిమా కథ.

​ప్లస్ పాయింట్స్:

​ఈ సినిమాకు ప్రధాన బలం అక్షయ్ కుమార్ అని చెప్పొచ్చు. తన మార్కు కామెడీ టైమింగ్‌తో కొన్ని సీన్లలో బాగానే నవ్వించాడు.

రాజ్ పాల్ యాదవ్ మరియు పరేశ్ రావల్ కాంబినేషన్ సీన్లు పాత రోజులను గుర్తుచేస్తాయి. వారి నటన సినిమాకు కొంత ఊరటనిస్తుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. బంగ్లా సెటప్ మరియు విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి.

​మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ పాయింట్ కథే. పాతకాలపు హారర్ సినిమాలను తలపించేలా ఈ సినిమా సాగుతుంది. స్క్రీన్‌ప్లే లో ఏమాత్రం కొత్తదనం లేదు.

హారర్ కామెడీలో భయం గానీ, నవ్వు గానీ పీక్స్‌లో ఉండాలి. కానీ ఇందులో హారర్ సీన్లు ఏమాత్రం భయపెట్టవు, పైగా చాలా చోట్ల సాగతీతగా అనిపిస్తాయి.

​సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్లు వెకిలిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించిన విధంగానే సాదాసీదాగా ముగుస్తుంది.

​సాంకేతిక విభాగం:

​దర్శకుడు ప్రియదర్శన్ తన పాత మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడంలో విఫలమయ్యాడు. కథలో పస లేకపోవడం వల్ల ఆయన అనుభవం కూడా సినిమాను కాపాడలేకపోయింది. సంగీతం పర్వాలేదు, కానీ పాటలు కథకు అడ్డుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది.

​తీర్పు:

​ఓవరాల్ గా చుస్తే.. ‘భూత్ బంగ్లా’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అక్షయ్ కుమార్ కామెడీ మరియు కొన్ని చోట్ల వచ్చే నవ్వులు మినహాయిస్తే, సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథనం, బోర్ కొట్టించే హారర్ సీన్లు ఈ సినిమాను నీరసపరిచాయి. అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబినేషన్ ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు