ఫోర్బ్స్ లో ఆ హాలీవుడ్ హీరోను సైతం దాటేసిన అక్షయ్.!

ఫోర్బ్స్ లో ఆ హాలీవుడ్ హీరోను సైతం దాటేసిన అక్షయ్.!

Published on Jun 6, 2020 12:52 AM IST

ప్రతీ ఏటా ప్రపంచ ప్రసిద్ధి ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాబడి పొందుతున్న సెలెబ్రెటీల జాబితాను విడుదల చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా విడుదల చేసిన టాప్ 100 మంది జాబితాలో మన దేశం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే నిలిచినట్టుగా తెలిపారు.

అక్షయ్ కుమార్ గత జూన్ 2019 నుంచి 2020 మే వరకు 48.5 మిలియన్ డాలర్ల రాబడితో 52వ స్థానంలో నిలిచారు. అయితే హాలీవుడ్ లో “ఐ రోబోట్”, “ఐయామ్ లెజెండ్”, “ఆఫ్టర్ ఎర్త్” లాంటి ఎన్నో భారీ సినిమాల్లో హీరోగా నటించిన విల్ స్మిత్ ఈ జాబితాలో 69వ స్థానంలో ఉండగా అక్షయ్ 52వ స్థానంలో నిలవడం విశేషం.ఈ జాబితాలో మోడల్ కైలీ జెనెర్ 590 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు