ట్రాన్స్‌జెండర్ల కోసం ఒకటిన్నర కోటి డొనేట్ చేసిన స్టార్ హీరో

Published on Mar 1, 2020 10:43 pm IST

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో
రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్, అక్షయ్ కుమార్ ఇద్దరూ సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. అదే వారి మధ్య మంచి అనుబంధం ఎర్పడటానికి సహకరించింది. అక్షయ్ కుమార్ తో లారెన్స్ కొన్నాళ్ళ ట్రాన్స్‌జెండర్ల కోసం ఒక చెన్నైలో వసతి భవంతిని నిర్మించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను తెలిపారు.

దాన్ని గుర్తుపెట్టుకున్న అక్షయ్ తాజాగా ఆ భవంతి నిర్మాణం కోసం తనవంతు సహకారంగా రూ.1.5 కోట్లు అందించారు. ఈ సందర్బంగా లారెన్స్ అక్షయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఇలా వసతి గృహాన్ని నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇకపోతే ‘లక్ష్మీ బాంబ్’ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో విడుదల తేదీని అధికారంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :

More