నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి – అక్షయ్ కుమార్

నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి – అక్షయ్ కుమార్

Published on Nov 26, 2018 8:12 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో ఘనంగా జరిగింది.

కాగా ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. నా కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ నేనెప్పుడూ చెయ్యలేదు. మేకప్ వేసుకోవటానికే రెండు గంటలకు పైగా టైం పడుతుంది. దానికి తోడు భారీ విగ్గు ఒకటి. ఏమైనా ఈ సినిమాలో నన్ను కూడా పార్ట్ చేసిన శంకర్ కి నా కృతజ్ఞతలు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ గారు, సూపర్ స్టార్ లా కాకుండా చాలా సింపుల్ గా ఉంటారు. ఇక సినిమాలోని నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా మీకు సరి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తోందని నేను నమ్ముతున్నాను అని అన్నారు.

కాగా అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసాద్ మరియు దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీ సంయుక్తంగా నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు