వెయిటర్ గా రూ. 1500లకు పనిచేసిన స్టార్ హీరో.

వెయిటర్ గా రూ. 1500లకు పనిచేసిన స్టార్ హీరో.

Published on Jun 2, 2020 1:55 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఏడాదికి కనీసం మూడు చిత్రాలు చేసే అక్షయ్ ఇండియాలోనే అత్యధిక సంపాదన కలిగిన నటుడు. 2019కి గాను ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ఆదాయం కలిగిన సెలెబ్రిటీల జాబితాలో వరల్డ్ లోనే అక్షయ్ 6వ స్థానంలో నిలవడం విశేషం. సినిమాల ద్వారానే కాకుండా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచార కర్తగా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మరి అలాంటి నటుడు కెరీర్ ప్రారంభంలో ఎంత సంపాదించాడో తెలుసా?

అక్షయ్ కుమార్ హీరోగా మారకు ముందు బ్యాంకాక్ నగరంలో ఓ విలాసవంతమైన హోటల్ లో వెయిటర్ మరియు చెప్ గా పనిచేశాడట. అందుకు గాను, ఆయనకు నెలకు 1500 రూపాయల జీతం అందేదట. సినిమాకు 50కోట్లకు పైగా తీసుకునే అక్షయ్ ఒకప్పుడు ఉద్యోగిగా అంత తక్కువ జీతానికి పనిచేశాడు. ఇక అక్షయ్ నటించిన లక్ష్మీ బాంబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు