
అమాలా పాల్ ను ఏ.ఎల్ విజయ్ వివాహం చేసుకోనున్నాడు అన్న వార్త అధికారికంగా ద్రువీకరించినప్పటినుండీ తమ మధ్య వున్నా ప్రేమను శతవిధాలా మనకు తెలియజేయడానికి అమల కష్టపడుతుంది. వీరిద్దరూ కొన్నేళ్ళ క్రితం విక్రమ్, అనుష్కల చిత్రం దైవ తిరుమగల్(తెలుగులో నాన్న) సినిమాకోసం కలిసి పనిచేసారు. అప్పటినుండి వీరిమధ్య స్నేహం చిగురించింది
గతంలో మా ఇద్దరి మధ్యా అటువంటి సంబంధం ఏమి లేదన్న ఈ భామ ఇప్పుడు “నా జీవితంలోకి ప్రవేశించి నా ఆలొచనలని, నా జీవితాన్నే పైనుండి క్రింది వరకూ మార్చేసిన ఆటను విజయ్. నాలో వున్న ఏదో శక్తీ ఆ మార్పులు నాకు చాలా నచ్చినట్లు తెలిపింది. ఆ తరువాతే అది మా మధ్య వున్నా ప్రేమ అని అర్ధమైంది. ఆటను చూపించే అనురాగంలో నేను తడిచి ముద్దయిపోతున్నా. నన్ను నాకు పరిచయం చేసినందుకు విజయ్ కి థాంక్స్” అని ఫేస్ బుక్ పేజ్ లో పెట్టింది
జూన్ 12న ఈ జంట చెన్నైలో ప్రముఖుల నడుమ ఒకటికానున్నారు. దానికంటే ముందు ఇరువురి కుటుంబాలు కేరళలో కలిసి నిశ్చితార్ధం చేసుకునే పనులలో వున్నారు

