గత నెల నవంబర్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన పలు చిన్న బడ్జెట్ సినిమాలు వచ్చాయి. అందులో ఫ్లాప్స్ గా మిగిలినవే ఎక్కువ. చాలా ఫ్లాప్స్ గా నిలిస్తే, అసలు అంచనాలే లేకుండా వచ్చిన ‘అలా ఎలా.?’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. కేవలం మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు విజేతగా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా తెలియజేశారు. ‘అలా ఎలా.? సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నాం. ఈ విషయాన్ని నేను తెలియజేయడం చాలా హ్యాపీగా ఉంది. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక జూన్ నుంచి షూటింగ్ మొదలు పెడతామని’ తెలిపాడు. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, శాని కలిసి నటించిన ఈ సినిమా ద్వారా అనిష్ కృష్ణ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.


