‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ,షాని సాల్మన్ ,భానుశ్రీ మెహ్రా ,ఖుషి ,హోభా పటేల్ ప్రధాన పాత్రల్లో అశోకా క్రియేషన్స్ పతాకంపై అశోక వర్దన్ నిర్మిస్తోన్న చిత్రం ‘అలా ఎలా’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.
కానీ నవంబర్ 21న బాక్స్ ఆఫీసు వద్ద చాలా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాని ఒక వారం వెనక్కి వేసారు. అనగా నవంబర్ 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ, స్నేహం, వినోదం మేళవించి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. మురళిమోహన్, కొండవలస, కృష్ణ భగవాన్, రాళ్లపల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించాడు.


