ఇంతకీ బన్నీ అలవైకుంఠపురంలో క్లాసా,మాసా?

ఇంతకీ బన్నీ అలవైకుంఠపురంలో క్లాసా,మాసా?

Published on Sep 3, 2019 1:13 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ సరసన మరో మారు పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఐతే ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీని వైవిధ్యంగా ప్రెసెంట్ చేశారు త్రివిక్రమ్. వెనుక కాస్ట్లీ కార్ తో సూటు బూటు ధరించి ఉన్న బన్నీ సెక్యూరిటీ గార్డ్ స్టూల్ పై కూర్చొని బీడీ వెలిగించుకోవడం వినూత్నంగా ఉంది. క్లాస్ లుక్ లో మాస్ మేనరిజం కలిగివున్నఆ పోస్టర్ ఆసక్తిరేపుతుంది. దీనితో ఈ చిత్రంలో బన్నీ పాత్రపై అనేక ఉహాగానాలు రేగుతున్నాయి.

గతంలో ఈ చిత్రం నుండి లీకైన ఫోటోలలో బన్నీ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లుక్ లో అగుపించారు. మరి తాజా పోస్టర్లో బన్నీ అలా మాస్ అప్పీరెన్స్ ఇచ్చారు. మరి ఈ చిత్రంలో బన్నీ పాత్ర మాస్ షేడ్స్ లో ఉంటుందా, లేక క్లాస్ షేడ్స్ లో ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ బన్నీ పాత్రను త్రివిక్రమ్ రౌడీ అల్లుడు మూవీలో చిరంజీవి పాత్ర లా రెండు డిఫరెంట్ షేడ్స్ లో డిజైన్ చేసాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు