వైజాగ్ వేడుకకు ప్రత్యేక విమానంలో అల వైకుంఠపురంలో టీం

Published on Jan 19, 2020 5:01 pm IST

అల వైకుంఠపురంలో టీమ్ నేడు వైజాగ్ లో జరుగనున్న విజయోత్సవ వేడుకను హాజరుకానున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళుతుంది. బన్నీ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం అనేక రికార్డ్స్ నమోదు చేస్తుంది. యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్లకు చేరుకున్న ఈ మూవీ $3 మిల్లియన్ వసూళ్లు సులభంగా చేరుకునేలా కనిపిస్తుంది. ఈ సంధర్భంగా అల్లు అర్జున్, పూజా, త్రివిక్రమ్ లతో కూడిన అల వైకుంఠపురంలో టీమ్ ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకున్నారు. నేటి సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకలో వీరు పాల్గొని సందడి చేయనున్నారు.

అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More