దబాంగ్ 3 లో టాలీవుడ్ సీనియర్ కమెడియన్ !

Published on Apr 20, 2019 1:34 pm IST

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ గత కొంత కాలంగా సినిమాలు చేయడం తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఒకటి , రెండు తప్ప పెద్దగా ఆఫర్లు లేవు. అవి కూడా మీడియం బడ్జెట్ చిత్రాలే . ఇక అలీ ఎట్టకేలకు స్టార్ హీరో నటిస్తున్న చిత్రంలో ఆఫర్ కొట్టేశాడు. కానీ తెలుగులో కాదు బాలీవుడ్ లో. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దబాంగ్ 3లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అలీ పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అలీ తన ఫ్యామిలీ తో కలిసి సెట్లో సల్మాన్ తో ఫోటో దిగారు.

సూపర్ హిట్ సిరీస్ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ విలన్ పాత్రలో నటింస్తుండగా సల్మాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుంది. ప్రభుదేవా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :