చెప్పుకో దగ్గ కంటెస్టెంట్స్ లేకపోవడంతో బిగ్ బాస్ నిరాశా జనకంగా సాగుతుంది. హౌస్ లో ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు తప్పితే, అసలైన గేమ్ ఎవరు కూడా ఆడటం లేదు. దీనితో ప్రేక్షకులని ఎవరు ఆకట్టుకోవడం లేదు. దీనితో బిగ్ బాస్ హౌస్ కి ఆకర్షణ జోడించేందుకు ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎలిమినేట్ అయిన వారిలో అలీ రెజానే బెస్ట్ ఆప్షన్ అని కూడా బిగ్ బాస్ భావిస్తున్నారట.
ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున అలీ రెజా వైల్డ్ కార్డు ద్వారా రావాలని కోరుకుంటున్నారు. తాజాగా ఒక ఆంగ్ల మీడియా కూడా అలీ రీ ఎంట్రీ గురించి ఒక కధనం రాసింది. స్టార్ మా నుండి వచ్చిన సమాచారం ప్రకారమే రాస్తున్నామంటూ చెప్పటం విశేషం. అలీ ఎంట్రీ ఈ ఆదివారం నాగార్జున ఎపిసోడ్ అయిన తర్వాత ఉండబోతుందని తెలుస్తుంది. ఒక వేళ అలీ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే షోకి ఏమైనా రేటింగ్ పెరుగుతుందేమో చూడాలి.గత సీజన్లో యాంకర్ శ్యామల మరియు నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ షోలోకి ప్రవేశించారు.
