రాజమౌళి సినిమాలో నటించడమే గొప్ప విషయం అంటున్న అలియా భట్

రాజమౌళి సినిమాలో నటించడమే గొప్ప విషయం అంటున్న అలియా భట్

Published on Sep 3, 2019 9:06 PM IST

a

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో నటిస్తున్న ఇద్దరు కథానాయికల్లో బాలీవుడ్ నటి అలియా భట్ ఒకరు. ఆమె చరణ్ సరసన నటిస్తోంది.

అయితే గత కొద్ది రోజులుగా అలియా చేస్తున్నది సినిమాలో గెస్ట్ రోల్ మాత్రమేనని, ఆమె పాత్ర నిడివి ఒక పాటకు, తక్కువ సన్నివేశాలకు మాత్రమే పరిమితమనే వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనని చిత్ర యూనిట్ చెబుతోందట. కానీ అలియా భట్ మాత్రం పాత్ర నిడివి తక్కువని ఏమాత్రం ఫీలవ్వడం లేదట.

అసలు ఆమె పాత్ర నిడివి గురించి ఆలొచించట్లేదట. తన డ్రీమ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడమే తాను గొప్పగా భావిస్తున్నానని, అంతేగాని పాత్ర లెంగ్త్ గురించి అస్సలు ఆలోచించట్లేదని చెబుతోంది. ఇకపోతే ఆమె ఈ నెలలో హైదరాబాద్లో జరగబోయే షెడ్యూల్లో చిత్ర బృందంతో జాయిన్ కానుంది. రూ.350 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు